భు భు భుజంగం...ధిత్తై తరంగం..
మృత్యూర్ మృదంగం... నా అంతరంగం
నాలో జ్వలించె తరంతరంగా.. నటనై చలించె నరం నరం గా
పగతో నటించె జతి స్వరంగా... ఓ..ఓ..ఓ....ఓఓఓఓఓ......
పాడనా...విలయ కీర్తనా..ఆడనా..ప్రళయ నర్తనా
కారు మేఘాలు కమ్ముకొస్తున్న కటిక చీకట్ల లో..
బానిసత్వాన రాణి వాసాలు రగిలిన జ్వాల లో..
డోలు కొట్టింది రాహువూ... మేళ మెత్తింది తీతువూ..
తరుముకొస్తుంది మృత్యువూ... తరిగి పోతుంది ఆయువూ...
చావు తోనే తీరు నాకు వేదనా...వేదనా... ఆఅ...ఆఆఆఆ
ఆడనా..ప్రళయ నర్తనా...పాడనా...విలయ కీర్తనా..
ఓ...ఓఒఓఓ....ఓ...ఓఒఓఓ....
బ్రహ్మ రాసినా రాతను ఆ బ్రహ్మ యే చెరుప లేడు రా...
ధర్మ మార్గమే తప్పితే ఆ దైవమే నీకు కీడు రా...
ఎదురుకో లేవు విధిని ఈనాడు ఎరుగ రా నిన్ను నీవికా...
రమణి సీత నే కోరినా నాటి రావణుడు నేల కూలెరా..
విషయ వాంఛలకు గెలుపు లేదు ఏనాడు...
అమ్మ జాతి తో బొమ్మ లాటలే కీడూ...
పడతి గా నేను పలుకుతున్నాను..
జన్మ కే నీకు చరమ గీతాలు...
అసుర ఘాతాలు అశనిపాతాలు
దుర్గ హస్తాల ఖడ్గ నాదాలు..
భగ భగ సెగలటు.. భుగ భుగ పొగలిటు
మగువల తెగువలు భగలుగ రగలగ
అగ్ని గ రేగిన ఆడతనం ఆరతి కోరెను ఈ నిమిషం
నీ ధుర్మరణం..ధుర్మరణం..ధుర్మరణం..ధుర్మరణం..
No comments:
Post a Comment