ఇక చెప్పక తప్పదుగా అని అనుకొని వచ్చా ఈ వేళ
చెబితే నువ్వేమంటావో తెలియదుగా
అరె ఎప్పటికప్పుడిలా…ఆహా
ఇపుడే మొదలని అనుకోవాలా
సరెలే వింటా మళ్లీ మరో కొత్త కథలా
ఇంకా ఏం చెప్పందే
మొన్నెప్పుడో విన్నట్టే
నువ్వేదోలా ఉన్నావంటే వదిలేద్దాంలే..
ఇవ్వాళే ఈ పూటే తేల్చేద్దాం కానీలే
సిద్ధంగానే ఉన్నాలే…
తడితడి పెదవుల తళతళ మెరుపులు
తగిలిన తలపులు విలవిలలాడేలా నవ్వితే ఎలా
పొడిగా విడిగా మడిగా గొడుగాపాలా తమరినిలా
కిల కిల సడి కవ్విస్తుందో కసిరిందో గుర్తించేదెలా
మనసేమందో వినలేవా సరిగా
నాలా నువ్వై నిలువెల్లా నువ్వే అయ్
గమనిస్తే నాలాగే గల్లంతై పోతావే
పోనీలే క్షమించెయ్..
పేచీలెందుకులే…చాల్లే ఎన్నాళ్లీ దోబూచీ
రాజీ పడదాంలే చక్కా…
ఎదురుగ దొరికితే కదలవు మెదలవు ఉలకవు పలకవు నిలబడి చూస్తావే
ఎంత సేపిలా
అపుడూ ఇపుడూ ఎపుడూ కొత్తగా ఉందే ఎందుకిలా
నీ తికమక చూస్తూ సమయమాగాలా??నీ కోసమలా
ఫరవాలేదే నువు లేవా జతగా
ఆకాశంలో ఎగరేస్తానంటావా
నన్నీ మాలోకంలో ముంచేస్తానంటావా
నీ వల్లే ఇదంతా..
నన్నే నీ వెంట దారి తప్పించి తిప్పించి వదిలేస్తావా ఒంటరిగా
ఇక చెప్పక తప్పదుగా అని అనుకొని వచ్చా ఈ వేళ
చెబితే నువ్వేమంటావో తెలియదుగా
అరె ఎప్పటికప్పుడిలా…ఆహా
ఇపుడే మొదలని అనుకోవాలా
సరెలే వింటా మళ్లీ మరో కొత్త కథలా
ఇంకా ఏం చెప్పందే
మొన్నెప్పుడో విన్నట్టే
నువ్వేదోలా ఉన్నావంటే వదిలేద్దాంలే..
ఇవ్వాళే ఈ పూటే తేల్చేద్దాం కానీలే
సిద్ధంగానే ఉన్నాలే…
No comments:
Post a Comment