ప్రేయసి కావు నేస్తం కావు
గుండెల్లో నిండున్నావు గుప్పెట్లో దాగున్నావు
చీకట్లో వెలుగిస్తావు జగమంతా కనిపిస్తావు
పడుంగ నీవు నా పచ్చిక నీవు ||2||
మోహమే మంటగ రగులుతున్నా
లోకమే నీవుగా మునిగి ఉన్నా
గాలిలో ఈకలా తేలుతున్నా
నీటిలో రాతలా చెదిరిఉన్నా
నీ శ్వస కోసం మానై వుంటా
నీ మాట కోసం మునినై పోతా
నీ చూపు కోసం శిలనై వుంటా
నీ నవ్వు కోసం అలుసైపొతా
జాబిలికే వెన్నెల నీవు సూర్యునికే వేకువ నీవు
వూపిరిలొ వుష్నం నీవు వూరించే తృష్నం నీవు
శూన్యం నీవు నా శ్లోకం నీవు ||2||
వేసవి వర్షమై కురిసిపోవా
వెచ్చనీ వేల్పువై వెలిగి రావా
మాట తో రూపమై తరలి రావా
నిర్ణయం చెప్పి నన్నాదుకోవా
నీ తోడు కోసం ఆవిరై పోనా
నీ స్పర్శ కోసం చినుకై రానా
నీ అడుగు తాకి గుడినై పోనా
నీ గుండెలోకి సడినై రానా
నీలానికి నింగివి నీవు కాలానికి గమ్యం నీవు
చలనానికి శక్తివి నీవు భావనికి మూలం నీవు
ఎవ్వరి కోసం జాబిలి వెసం
కమ్మని కావ్యం ఈ వెన్నెల దీపం ||2||
No comments:
Post a Comment