14 July 2010

మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు

పల్లవి

మా రాజులొచ్చారు మహరాజులొచ్చారు
మా ఇంటికొచ్చారు మామంచివారంట
మనసున్న వారంట మాకెంతో నచ్చారు
||మారాజు||

చరణం 1

పట్నాలలో ఉండు పెదబాబుగారు
పల్లెసీమకు నేడు వేంచేసినారు
కొండంత దేవుణ్ని కొలిచేది ఎలాగో
తెలియక మేమంత తికమక పడ్డాము
||మారాజు||

చరణం 2

ముద్దపప్పే కలుపుకోండి
కొత్త ఆవకాయే నంచుకోండి
అత్తమ్మ వండిన గుత్తి వంకాయండీ||2||
మచ్చు చూశారంటే మళ్ళీ తెమ్మంటారు
||మారాజు||

చరణం 3

బూరెలే వడ్డించ మంటారా నేతిగారెలే వేయించుకుంటారా
బొబ్బట్లు నేతిలో ముంచి దంచారంటే||2||
వైకుంఠమే వచ్చి వాకిట్లో దిగుతుంది
||మారాజు||

చరణం 4

ఉన్నంతలో సేవలొనరించినాము
చిన్నారి మనసులే అర్పించినాము
మా ఇల్లు చల్లగా మీరు దీవించాలి||2||
మీ చూపు నీడలో మేము జీవించాలి
||మారాజు||

No comments: