14 July 2010

ప్రేమించనిదే పెళ్ళాడనని తెగకోతలు కోశావులే

పల్లవి

ప్రేమించనిదే పెళ్ళాడనని తెగకోతలు కోశావులే
ఆ మాటలు ఏమైనవి అహా అయ్యగారు ఓడారులే
పెళ్ళాడనిదే ప్రేమించనని తెగ లెక్చరు దంచావులే
ఆ మాటకు నీ చేతకు అహ అంతు పొంతు లేదాయలే

చరణం 1

నీ వలపు తెలుపక అహ అంటిని నా తలపు తెలియక ఔనంటివి||2||
నీ ఆశయం ఏమైనది అహ నీటిమూట అయిపోయెలే
||ప్రేమించనిదే||

చరణం 2

శ్రీరంగనీతులు చెప్పావులే చిత్రంగ ప్లేటును తిప్పావులే
అమ్మాయిలు ఎటు కుంగినా ఆహా అందమంత చిందేనులే
||పెళ్ళాడనిదే||

చరణం 3

ఈ సొగసులన్ని కవ్వింతులే నా వయసు నిన్నే బాధించులే
కనుపాపలో నిను దాచితే నను వీడి పోలేవులే
||ప్రేమించనిదే||

చరణం 4

పైపైన మెరుగులు కొన్నాళ్లులే మదిలోన మమతలు పూయాలిలే
వయ్యారమే ఒలికించినా అయ్యగారు చలియించరు
ఆహా అయ్యగారు చలియించరు
||ప్రేమించనిదే||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips