14 July 2010

ప్రేమించి పెళ్ళి చేసుకో నీ మనసంతా హాయి నింపుకో

ఓ సోదరసోదరీమణులారా ఆదరించి నా మాట వింటారా
వింటాం చెప్పు

పల్లవి

ప్రేమించి పెళ్ళి చేసుకో నీ మనసంతా హాయి నింపుకో
||ప్రేమించి||

చరణం 1

వరుని వలపేమిటో వధువు తలపేమిటో
తెలుసుకోలేక పెళ్ళిళ్ళు జరిపించినా
తెలిసి కట్నాలకై బతుకు బలి చేసినా
కడకు మిగిలేది ఎడమోము పెడమోములే
||ప్రేమించి||

చరణం 2

మనిషి తెలియాలిలే మనసు కలవాలిలే
మరచిపోలేని స్నేహాన కరగాలిలే
మధురప్రణయాలు మనువుగా మారాలిలే
మారి నూరేళ్ళ పంటగా వెలగాలిలే
||ప్రేమించి||

చరణం 3

నలుడు ప్రేమించి పెళ్ళాడె దమయంతిని
వలచి రుక్మిణియే పిలిపించె శ్రీకృష్ణుని||2||
తొలుత మనసిచ్చి మనువాడె దుష్యంతుడు
పాత ఒరవళ్ళు దిద్దాలి మీరందరూ
||ప్రేమించి||

No comments: