17 July 2010

నీవు రావు నిదుర రాదు నిలిచి పోయె యీరేయి

నీవు రావు నిదుర రాదు నిలిచి పోయె యీరేయి
నీవు రావు నిదుర రాదు

తారా జాబిలి వొకటై సరస మాడే ఆరెయి
తారా జాబిలి వొకటై సరస మాడే ఆరెయి
చింత చీకటి వొకటై చిన్నబోయె యీ రేయి

ఆశలు మదిలో విరిసే దొసిట విరులై కురిసే
ఆశలు మదిలో విరిసే దొసిట విరులై కురిసే
ఆలయాన చేరి చూడ ఆలయాన చేరి చూడ
స్వామి కాన రాడాయె నా స్వామి కాన రాడాయె

కౌగిలిలో వొదిగి పోయి కలలు గనే వేళాయె
కౌగిలిలో వొదిగి పోయి కలలు గనే వేళాయె
యెదురు చూసి యెదురు చూసి
యెదురు చూసి యెదురు చూసి కన్నుదోలి అలసిపోయె

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips