18 July 2010

చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా

చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా
చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా
చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురు కోయగలవా
ఓ నరహరి చిగురు కోయగలవా

చెట్టులెక్కగలనే ఓ చెంచిత పుట్టలెక్కగలనే
చెట్టులెక్కగలనే ఓ చెంచిత పుట్టలెక్క గలనే
చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురు కోయగలనే
ఓ చెంచిత చిగురు కోయగలనే

ఉరకలేయగలవా! ఓ నరహరి పరుగులెత్తగలవా
ఉరకలేయగలవా! ఓ నరహరి పరుగులెత్తగలవా
ఊడపట్టుకొని జారుడుబండకు ఊగి చేరగలవా ఓ నరహరి ఊగి చేరగలవా
ఉరకలేయగలనే ఓ చెంచిత పరుగు లెత్తగలనే
ఊడపట్టుకొని జారుడుబండకు ఊగి చేరగలనే
ఓ చెంచిత ఊగి చేరగలనే

ఓ గుఱిని చూసుకొని కనులు మూసుకొని బాణ మేయగలవా
ఈ నరహరి బాణ మేయగలవా
గుఱిని చూసి వెనుతిరిగినా నేర్పుగ బాణమేయగలనే ఓ
చెంచిత బాణమేయగలనే
ఓ చెంచిత నిన్ను మించగలనే

చెట్టులెక్కగలనే ఓ చెంచిత పుట్టలెక్కగలనే
చెట్టులెక్కగలనే ఓ చెంచిత పుట్టలెక్కగలనే
చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురు కోయగలనే
ఓ చెంచిత చిగురు కోయగలనే

ఓ తగవులేల ఎగతాళి కాదు నన్ను తాళి కట్టనీవా
ఓ చెంచిత తాళి కట్టనీవా
మనసు తెలుసుకొని మరులు చూపితే మనువునాడనిస్తా
ఓ నరహరి మనువునాడనిస్తా మూలతెచ్చి వేస్తా

చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా
చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా
చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురు కోయగలవా
ఓ నరహరి చిగురు కోయగలవా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips