01 July 2010

నువ్వంటే ప్రాణమనీ నీతోనే లోకమని

నువ్వంటే ప్రాణమనీ నీతోనే లోకమని

నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
కన్నులకి కలలు లేవు నీరు తప్ప || నువ్వంటే...||

మనసూ వుంది మమతా వుంది పంచుకునే నువు తప్ప
ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలనే ఆశ తప్ప
ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా

ప్రేమిస్తేనే సుధీర్గ నరకం నిజమేనా

ఎవరిని అడగాలి నన్ను తప్పా చివరికి ఏమవ్వాలి మన్ను తప్పా || నువ్వంటే ||

వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానాన్నవు జంటై ఒకరి పంటై వెళ్ళావు
కరుణిస్తానన్నావు వరమిస్తనన్నావు కరువై మెడకు ఉరివై పోయావు
దేవతలోనూ ద్రోహం వుందని తెలిపావు
దీపం కూడా దహియిస్తుందని తేల్చావు

ఎవరిని నమ్మాలి నన్ను తప్పా ఎవరిని నిందించాలి నిన్ను తప్ప || నువ్వంటే ||

నువ్వంటే ప్రాణమనీ నీతోనే లోకమని

నీ తోడే లేకుంటే బ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
కన్నులకి కలలు లేవు నీరు తప్ప

No comments:

                                                           Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips