02 July 2010

అల్లో నేరెళ్ళో....... అల్లో నేరెళ్ళో.......

||పల్లవి||
అల్లో నేరెళ్ళో....... అల్లో నేరెళ్ళో.......
అల్లో నేరెళ్ళో....... అల్లో నేరెళ్ళో.......
జనకుని కూతురు జానకి అల్లో నేరెళ్ళో.......
జాజుల సోదరి జానకి అల్లో నేరెళ్ళో.......
మిధిలానగరిని జానకి అల్లో నేరెళ్ళో.......
ముద్దుగ పెరిగిన జానకి అల్లో నేరెళ్ళో.......
అందాల రాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లో నేరెళ్ళో.......
అల్లో నేరెళ్ళో....... అల్లో నేరెళ్ళో.......
అల్లో నేరెళ్ళో....... అల్లో నేరెళ్ళో.......

||చరణం 1||
ఏటిపాయల పాపిటకి కుంకుమబొట్టే ఆభరణం.......
ఎదురుచూపుల కన్నులకి కాటుకరేఖే ఆభరణం.......
పుడమినంటని పదములకి పసుపు వన్నెలే ఆభరణం.......
మాటరాని పెదవులకి మౌనరాగమే ఆభరణం.......
మగువ మనసుకి ఏనాటికి మనసైనవాడే ఆభరణం.......
అందాల రాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లో నేరెళ్ళో.......

||చరణం 2||
చేయి జారిన చందమామని అందుకోగలనా.......
రాయలేని నా ప్రేమలేఖని అందచేయగలనా......
దూరమైన నా ప్రాణజ్యోతిని చేరుకోగలనా.....
చేరువై నా మనోవేదన మనవి చేయగలనా.......
నా ప్రేమతో తన ప్రేమనే గెలుచుకోగలనా.......
అందాల రాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లో నేరెళ్ళో.......

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips