15 July 2010

దేవా దేవా దేవదా దేవాది దేవా దేవదా

పల్లవి

దేవా దేవా దేవదా దేవాది దేవా దేవదా
మనిషిలో దేవుడివా సత్పురుషాయ విఘ్మహే
మమతకి దాసుడివా సత్యసంహయ విఘ్మహే
జనుల కనులలో కొలువు తీరినా వరముల రూపం నువ్వా
ప్రజల పెదవులే కలవరించిన ప్రార్ధన గీతం నీవా దేవాది దేవా దేవాదిదేవా
దేవాది దేవా అందరి దేవా వందనం వందనం -2
అందరి దేవా అందిన దేవా వందనం వందనం ||మనిషిలో...||

చరణం 1

శంఖ చక్రములు లేకున్నా శాంతి సహనముంది
చతుర్భుజములు లేకున్నా చేయూత గుణమునీది
పసిడి కిరీటము బదులుగా పసి మనసే నీకు ఉందిగా
ఖడ్గాల పదును గల వీరత్వం
కన్నాము విన్నాము అందరం
కన్నీరు తుడుచు నీ అమ్మతనం
పారేందుకు అయ్యాము పిల్లలం
గుడినే వదిలి గుండెను చేరిన దేవా
దేవాది దేవా దేవాదిదేవా ... దేవాదిదేవా అందరి దేవా వందనం వందనం - 2
అందరి దేవా అందినదేవా వందనం వందనం ||మనిషిలో...||

చరణం 2

మంచి మనిషిగా బ్రతికేస్తే బాధలేదు మనకు
మానవత్వములు కతికిస్తే దైవమెందుకొరకు
అన్నది నాలో భావనా ఉన్నదిగా మీ దీవెనా
మదిలోని మాటనే చెబుతున్నా ఆనందభాష్పాల సాక్షిగా
మరిదేవుడంటు ఇక ఎపుడైనా చూడొద్దు నన్నింకా వేరుగా
మీలాంటోడిని మీలో ఒకడిని కాని
దేవుడే మానవుడై దరిచేరగా మనవాడై
దేవాధిదేవా అందరి దేవా వందనం వందనం - 2

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips