పల్లవి
ఒక్కమగాడు ఓ... ఒక్కమగాడు కౄరాతికౄరంగా వేటాడే సింహం
ఒక్కమగాడు వాడేవీడు వీడేవాడు నాకున్న ఏకైక శత్రువుగాడు రానేరాడు
వస్తేపోడు నాపైకి దూకేటి మృత్యువుగాడు శక్తియుక్తి శౌర్యం కలబోసిన
రూపం వీడు శివుడు విష్ణువు కాడు ఆ బ్రహ్మకు అర్ధం కాడు ... ఒక్కమగాడు
చరణం 1
భీభత్సాలు తెలిసినోడు భక్తి భయము తెలియనోడు
ఉన్నాడొకడు డు డు డు ఒక్కమగాడు
దిగ్గారాలు కలిగినోడు దిక్కులు దాటి నిక్కినోడు
ఎవడుంటాడు డు డు డు ఒక్కమగాడు
వీడే వీడే వీడే చండశాసనుడు ... వీడే వీడని వీడక సాగే అణుచరుడు
హృదయం లేని ఆయుధం వీడు నరకం లోని ఆశ్రయం వీడు
ఉన్మాదం,క్రోధం,గర్వం మొండెం అన్నిటికర్ధం వీడు ... ఒక్కమగాడు...
చరణం 2
ఒకటో వాడు మంచివాడు రెండోవాడు చెడ్డవాడు
రెండు కాదు డు డు డు ఒక్కమగాడు
మనసుకు మీసం వచ్చినోడు మరణంతోటి ఆటగాడు
ఇంకా ఎవడు డు డు డు ఒక్కమగాడు
వీడే వీడే వీడే ప్రతినాయకుడు ... ఏదో ఏదో ఏదో పరిశోధకుడు
ప్రజలే లేని ప్రపంచం వీడు ప్రాణాలున్నా శ్మశానం వీడు
గుణగణములు అన్నీ తేడా గనుకే గాఢంగా నచ్చాడు ||ఒక్కమగాడు||
No comments:
Post a Comment