15 July 2010

అమ్మతో చెప్పుకున్నా నాన్నతో చెప్పుకున్నా

పల్లవి

అమ్మతో చెప్పుకున్నా నాన్నతో చెప్పుకున్నా ఎవరితో చెప్పుకున్నా కాస్కో తడాకా
అన్నతో చెప్పుకున్నానే బావతో చెప్పుకున్నాగా ఎవరితో చెప్పుకున్నా చూస్కో ధమాకా
పైట పైపైనా అందమే పొంగుతున్నా
లోన లోలోనా అలజడే అణుచుకున్నా
తపించే చిన్నవాడిని తెగించే పెద్దవాడిని తరించే తప్పు చెయ్యనా ...||అమ్మతో||

చరణం 1

ఒకచోట అంటూనే మరుచోట చెయ్యేస్తాడే
చెయ్యేసి పొరపాటు చేసేస్తాడే
ఒకసారి అంటూనే పలుసార్లు ముద్దిస్తాడే
ప్రతిసారి పొలిమేర దాటేస్తాడే
పోనా సరిపోనా గోపికా రెచ్చిపోనా
చాలా నచ్చానా కొద్దిగా రెచ్చిపోరా
నిజంగా మంచివాడిని ప్రియంగా పిచ్చివాడిని, స్ధిరంగా చిచ్చురేపనా ||అమ్మతో...||

చరణం 2

కూర్చున్నా నిలుచున్నా పడుకున్నా ఏం చేస్తున్నా
వాటేసి నా ప్రేమ నాటేస్తానే
గుబులైనా దిగులైనా తెగులైనా ఏ బాదైనా గురిచూసి మురపాల మందేస్తానే
న్నా న్నా న్న న్న నా అంతగా వేడుకున్నా
అవునా అవునవునా అందుకే వేచివున్నా
మరి నే చిన్నపాపని వరిస్తే పెద్దపాపని మురిస్తే పాపనివ్వనా...||అమ్మతో...||

No comments: