02 July 2010

నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా ..........

||పల్లవి||
నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా ..........
నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా ...
చల్లగాలి ...చందమామ ... మల్లెతీగ ... చిలకమ్మ.....మీలో.. ఒకరైనా.....
నా పేరు చెప్పుకోండి...
నా....నా....నా పేరు చెప్పుకోండి .....

||చరణం 1||
కవిత, సరిత , మమత, నిఖిత, రెండు జళ్ళ సీత....
ప్రతిమ, ఫాతిమ, మహిమా, ఉమ, సత్యభామ.....

నీలిమేఘాలతోటి ఆడుకుంటాను గాని నా పేరు నీలిమ కాదు
అన్ని రాగాలబాణి పాడుకుంటాను గాని నా పేరు రాగిణి కాదు
బంగారమంటి మనసుంది గాని నా పేరు కనకం కాదు
భోగాలు పంచే సొగసుంది గాని నా పేరు భాగ్యం కాదు
హొ హొ హ్హో....హొ హొ హొ హ్హొ.....
ఓటమంటు వొప్పుకోను విజయను కాను
వొట్టిమాట చెప్పలేను సత్యను కాను
మీ ఊహకే వదిలేస్తున్నాను ఊహను కాను.. కల్పన కాను
నా పేరు.....నా ..నా ...నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా
నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా

||చరణం 2||
చిన్ని చెక్కిళ్ళలోనా కొన్ని గులాబిలున్న నా పేరు రోజా కాదు
అన్ని పుష్పాలు చేరి నను అర్చించుతున్న నా పేరు పూజిత కాదు
ఏ కన్ను సోకని కన్యను ఐనా నా పేరు సుకన్య కాదు
అమవస చీకటి అంటదు ఎపుడు నా పేరు పూర్ణిమ కాదు
హొ హొ హ్హో....హొ హొ హొ హ్హొ.....
బోలేడంత జాలి ఉంది కరుణను కాను
అంతులేని పేరు ఉంది కీర్తిని కాను
మీరే మీరే తేల్చాలండి మీరా నసలే కానే కాను....

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips