02 July 2010

సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...

సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...
సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...
నీ చిరు చిరు నగవుల కిల కిల సడి తో
వలపుల పాటలు పాడవా..
వలపుల తెలుగుల తొలి పిలుపులలొ
చెలిమికి నా మది చూపవా..

||సన్నజాజి||

ఏతోటలో ఏ కొమ్మకో తారల్లె విరిసిన పువ్వా...
నాలో కోరిక వినవా తన సిగలో జాబిలి కావా.
వేసంగిలో వెన్నెల్లలో గువ్వల్లె మెరిసిన పువ్వా...
నాలా నువ్వై పోవా తన ఒడిలో పాపవు కావా
పసి పసి మనసుల మొరలను వినవా
మధురిమ మంత్రం వేయవా...
మా పరుగుల ఉరుకుల ప్రేమల త్రోవ
పరిమళ భరితం చేయవా...

||సన్నజాజి||

ముత్యానికే ముస్తాబు లా తెల్లంగ పూచిన పువ్వా
నాతో ఏకం కావా తన పదముల పూజకు రావా
గోదారికే పైటంచులా స్వచ్చం గా విచ్చిన పువ్వా
నాలో సిగ్గులు కనవా నా తేనెలు తనకందీవా..
ఇటు అటు తెలియని వయసుల గొడవా
తెలియని నువ్వే తేల్చవా..
మా ఇరువురి నడుమన వారధి కావా
ఈ ఒక సాయం చేయవా...

||సన్నజాజి||

No comments: