02 July 2010

అమ్మగారి నాన్నగారి తాతగారి

||పల్లవి||
అమ్మగారి నాన్నగారి తాతగారి బామ్మగారి చాటునున్న చంటిపాపరో....
కళ్ళజోడు బాపుగారి రాఘవేంద్రరావు గారి ఫిల్ములోని పడుచుపాపరో.....
సీతారామయ్యగారి మనవరాలురో.......
బెల్లంతో కలుపుకుంటే మరమరాలురో......
నో అంటే ఎస్సనిలే......... పొమ్మంటే రమ్మనిలే....
ఛీ అంటు కసురుకుంటే... టోటల్ గ ఓకేరో........ ||అమ్మగారి నాన్నగారి||

||చరణం 1||
ఉత్తరాన్ని చించిందంటే నీపై చిత్తశుద్ధి ఉన్నట్టే......
గిఫ్టు తిప్పి పంపిందంటే నిన్ను గాడుగిఫ్టు అనుకున్నట్టే
బండబూతు తిట్టిందంటే నీపై బండెడంత ప్రేమున్నట్టే.....
చెప్పు చేత పట్టిందంటే నీ చెప్పు చేతల్లొ ఉంటుందన్నట్టే
కస్సంటే కిస్సనిరో..... బుస్సంటే కస్సనిరో......
ఆడాళ్ళ మాటలకు అర్థాలు రివర్సురో...... ||అమ్మగారి నాన్నగారి||

||చరణం 2||
పైట కాస్త సర్దిందంటే నిన్ను సైటు కొట్టమన్నట్టే.....
వెనక తిరిగి చూసిందంటే నీ పై ముందు చూపులున్నట్టే
పెదవి కొరికి చూసిందంటే నీకు పచ్హ జండ చూపినట్టే......
అన్నతోటి చెప్పిందంటే నిన్ను అల్లుడిగ ఇంట్లోకి రమ్మన్నట్టే
తప్పంటే తప్పదనిరో..... ఉ ఊ అంటే ఉన్నదనిరో....
ఆడాళ్ళ మాటలకు కొత్త డిక్షనరి కావాల్రో.... ||అమ్మగారి నాన్నగారి||

No comments: