20 July 2010

కన్నయ్య బాలురు గొల్లులు చెప్పిరిగాని

పల్లవి

కన్నయ్య బాలురు గొల్లులు చెప్పిరిగాని
ఏ పాపమెరుగునే తల్లి నేను మన్నసలే తినలేదే తల్లి
ఏయ్‌ అబద్ధాలడతావు
మన్ను తినడానికి నీకు ఏం కర్మ పట్టిందిరా
నీకు వెన్నల్లేవాఅ, జున్నులేవా, అరిసెల్లేవా పోని అటుకుల్లేవా
నీకు నీకు నీకు పంచదార పూరీలు లేవా
నీకు మిరపకాయ బజ్జీలు లేవా నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా
లడ్డు మిఠాయి నీకు లడ్డు మిఠాయి నీకు రమ్మముగా చేయిస్తా
మన్నేల తింటివిరా కృష్ణా ||2||
లడ్డు మిఠాయి నీకు రమ్మముగా చేయిస్తా
మన్నేల తింటివిరా కృష్ణా ||2||

చరణం 1

పొద్దుకాల తడిపిచూడా పొదుగుపాలు తాగబోతే
ఆ తాగబోతే లాగిపెట్టి తన్నిందే మట్టిముట్టి తన్నిందే
ఉల్లి పెసరట్లు లేవా ఉప్మా మినపట్లు లేవా అప్పలెనకా పప్పులు లేవా
కొట్టిన కొబ్బరి చిప్పలు లేవా నీకు కాకినాడా ఖాజాలు లేవా నీకు
మైసూరు బొండాలు లేవా నును బందరు లడ్డూలు లేవి ఆహ తత్రిపురం పూతరేకులు లేవా
రంగు జాంగిరి నీకు రమ్మముగా చేయిస్తా
మన్నేల తింటివిరా కృష్ణా ||2||

చరణం 2

మేటి గట్టు తోటలోన మొక్కనాటి నీరుకట్టి ఎరువుమీద ఎరువేసి
ఏపుగా పెంచినట్టి చెక్కర కేలీగెలలు లేవా పంపర పనస తొనలు లేవా
పూరిల్లే వా పూరిలేవా తేనెలు రుల్ని గారెల్లేవా నీకు కాశ్మీరు
యాపిల్సు లేవా మీరు కోరుకున్న బత్తాయి లేదా ఇటు వడ్లమూడి
నారింజ లేదా యోగపూరు దానిమ్మలు లేవా పాల ముంజలు నీకు
పరువముగా చేయించి
మన్నేల తింటివిరా కృష్ణా ||2||

No comments: