15 July 2010

వచ్చింది పాలపిట్ట తెచ్చింది పూలబుట్ట

పల్లవి

వచ్చింది పాలపిట్ట తెచ్చింది పూలబుట్ట
నచ్చావే పాలపిట్ట రెచ్చావే కోడిపిట్ట
ఈ కట్టుబొట్టు కరిగేటట్టు కన్నె గురిపెట్టా
నీగుట్టు మత్తు లాగేటట్టు ఒళ్ళో కొలువెట్టా
మొదలెట్టాలమ్మో అష్టచెమ్మాటహేయ్
వచ్చింది పాలపిట్ట తెచ్చింది పూలబుట్ట
నా పుట్టుమచ్చ మోగేటట్టు నువ్వే ముద్దెట్ట
నా చుట్టు కొలత చిక్కేటట్టు నువ్వే నలిపెట్టు
మోరపెట్టిందమ్మి లాలూపట్టా ||నచ్చావే||
చీకట్లో వద్దంటావు వెన్నెల్లో సిగ్గంటావు
ఏందమ్మో ఎడ్డం అంటే తెడ్డం అంటావు
కాయిస్తే ఛీ అంటావు పండిస్తే ఫో అంటావు
ఏందయ్యో ఇంకా ఏదో కావాలంటావు
సొంపుల తొనలు ఒలుచుకుంటా
ఒంటిని తడిపి జడుసుకుంటా
ఔనంటే బాదం పిస్తా కొనితెస్తాలే బాలా
అందాలే రేపటికిస్తా పైపైకొస్తావేళా
అందాకా చూస్తూఉండాలా ||నచ్చావే||
పొద్దున్నే పూజంటావు మధ్యానం మడి అంటావు
సాయంత్రం సరదా పడితే సంతుకుపోతావు
సోకంతా తరిస్తావు నడుమంతా తడిమేస్తావు
గడియైనా వెళ్ళకముందే గడబిడ చేస్తావు
చిల్లర పనులు మానుకుంటూ
జల్లెడ పడితే వల్లరంట
నీతోటి సరసం చేసి పోతానమ్మో కాశీ
నీతోనే చొరవే చూసిఅయ్యోనయ్యో దాసి
పట్టాగా నిన్నే ఎరవేసి ||నచ్చావే||

No comments: