02 July 2010

ఓ చంద్రమా మచ్చేలేని ప్రియబంధమా

ఓ చంద్రమా మచ్చేలేని ప్రియబంధమా
యే నాటికీ నన్నే వీడి పోబోకుమా
చెలి నీవే నా ఆరోప్రాణం అంతున్నానే
కలకాలాలు నీతో చేరి వుంటా నేనే
ఇక నీతోనె యేకం అవుతు లోకాలే నే మరిచేనా
ఓ చంద్రమా మచ్చేలేని ప్రియబంధమా
ఓ అందమా నా ప్రియరాణి నీవే సుమా

ఓ గోరింకా నూరేళ్ళింకా తొదే నీవై వుండాలిలే
ఓ నా మైనా యే జన్మానా నీకె జంటై వుంటానులే
నీ గుండెలోనా వున్నంత ప్రేమా
ఆ కళ్ళలోనా చూసా ఈ వేళా
చేసాక నిలపాలి బాస
ఇచ్చక మాటా విడిచేన బాట
విడిపోయే వరకు నా శ్వాసా

అంతా నీకే సొంతం అవుతా నీ ప్రేమంతా అందించుమా
అయితే నాకో ముద్దిస్తేనే ప్రేమిస్తాలే ఓ నేస్తమా
నేడే నీతోనా నేనవుతు వీణ
నీ పూలవాన స్వప్నాలలోనా
నిలువెల్ల పులకించిపోనా
నేనే నీవైనా ఆ వేణువులోనా రాగాలు రవళించుకోనా
ఓ అందమా నా ప్రియరాణి నీవే సుమా
యే నాడికా నిన్నే వీడి పోలేనుగా
ఇక నీవే నా ఆరొప్రాణం అంతున్నాలే
కలకాలాలు నీతో చేరి వుంటా నేనే
సఖి నీతోనె యేకం అవుతు లోకాలే నే మరిచేనా
ఓ చంద్రమా ఓ అందమా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips