02 July 2010

చూసేకొద్దీ నిన్నే...... చూడాలనిపిస్తుందీ.....

||పల్లవి||
చూసేకొద్దీ నిన్నే...... చూడాలనిపిస్తుందీ.....
చూడవలసిందీ...... ఇంకా ఎంతో ఉందీ.....
అందాల లోకమేదో నీలో దాగుంది
ఆనందం లోతు ఎంతో నేడే తెలిసింది
చూసేకొద్దీ నిన్నే...... చూడాలనిపిస్తుందీ.....
చెప్పాలనిపిస్తుందీ... ఇది.... ||చూసేకొద్దీ నిన్నే||

||చరణం 1||
కదిలే శిల్పమా....
పెదవులను కదిపే దీపమా....
పడుచు రాగమా.....
పరిచయమైన ప్రణయ మేఘమా....
పదారు కళలకు నొసట తిలకమిడు సిసలు తెలుగుదనమా.... ||చూసేకొద్దీ నిన్నే||

||చరణం 2||
ఎదలో గగనమా....
ఎదుటపడి ఎదిగే మధనమా....
మధుర గానమా.......
మలుపులలోన మది ప్రయాణమా.....
నవీన చరితల తలకు కుసుమమిడు వలపు లతల వనమా..... ||చూసేకొద్దీ నిన్నే||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips