02 July 2010

అమ్మాయే సన్నగ

అమ్మాయే సన్నగ
అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
ఆ వారి చూపులకు మంచైన మరిగేలే
ఆ నవ్వులు ఈ చూపులు
ఆ నవ్వులు ఈ చూపులు కనిపిస్తే ప్రేమేలే

ప్రేమలు పుట్టె వేల పగలంత రేయ్యేలే
ప్రేమలు పండె వేల జగమంత జాతరలే
ప్రేమే తోడుంటె పామైన తాడేలే
ప్రేమే వెంటుంటె రాయైన పరుపేలే
నీ ఒంట్లో ముచెమటైన నా పాలిత పన్నీరే
నువ్విచె పచ్చి మిరపైన నా నోటికి నారింజె
ఈ వయసులో ఈ వరసలో
ఈ వయసులో ఈ వరసలో నిప్పైన నీరేలే

నేనొక పుస్తకమైతే నీ రూపె ముఖ చిత్రం
నేనొక అకషరమైతే నువ్వేలే దానర్ధం
యెగిరె నీ పైటె కలిగించె సంచలనం
ఒలికే నీ వలపె చెయ్యించె తలస్నానం
యెండల్లొ నీరెండల్లో నీ చెలిమె చలివెంద్రం
మంచుల్లో పొగ మంచుల్లో నీ తలపె రవి కిరణం
పులకింతలె మొలకెత్తగ
పులకింతలె మొలకెత్తగ ఇది వలపుల వ్యవసాయం

No comments: