02 July 2010

హై రె హై జాంపండు రొయ్ హై రె హై జాంపండు రొయ్

హై రె హై జాంపండు రొయ్ హై రె హై జాంపండు రొయ్
కళ్ళ ముందు కదులుతొంది రొయ్ ముద్దుగా
ఎం రూపు రా ఎం రంగు ర ఎం రూపు రా ఎం రంగు రా
సొంత మైతె అంత కన్న నా అయ్య బబొయ్
హై రె హై జాంపండు రొయ్ హై రె హై జాంపండు రొయ్ చూడ గానె నూరూరె రా తీయ్యగా
ఎం రూపు రా ఎం రంగు ర ఎం రూపు ర ఎం రంగు రా
సొంత మైతె అంత కన్న నా అయ్య బబొయ్

చరణం 1

అందమైన కొన సీమ కొబ్బరాకు లా
తెల్లవారి వెలుగు లోన తులసి మొక్క లా
పెరటిలోన పెంచుకున్న ముద్దబంతి లా
పెరుగులోన నంజుకున్న ఆవకాయ లా
బుట్ట బొమ్మ లా పాల పిట్ట లా గట్టు దాటు గోదారి లా
యెయ్యెయ్యె యెయె యెయె యెయ్యెయ్యె
హొయ్ తేనె చుక్క లా వాన చినుకులా మామ్మ గారి ముక్కు పుడక లా వుంది పిల్ల

చరణం 2

పాత తెలుగు cinemaలొ సావిత్రి లా
ఆలయాన వెలుగుతున్న చిన్ని దివ్వె లా
తామరాకు వొంటి పైన నీటి బొట్టు లా
వాకిలంత నిండి వున్న రంగు ముగ్గులా
చేప పిల్ల లా చందమామ లా ముద్దు ముద్దు మల్లె మొగ్గ లా
యెయ్యెయ్యె యె యెయ్యెయ్యెయ్య్య్ యెయెయె యె
ఒయి చెరుకు పంట లా భోగి మంట లా
పసుపు రంగు ఇంటి గడపలా వుంది పిల్ల

No comments: