02 July 2010

CM PM అవ్వాలన్న ఆశే లేదు......

||పల్లవి||
CM PM అవ్వాలన్న ఆశే లేదు......
UK US వెళ్ళాలన్న షోకే లేదు.....
హోటల్లోనే ఉండాలన్న రూలే లేదు.......
కోట్లల్లోనే మునగాలన్న కోరికలేదు......
హాపీగా లైఫంతా గడపటానికీ........
కొంచెం నేముంటే చాలు...... కొంచెం ఫేముంటే చాలు
కొంచెం డబ్బుంటే చాలు.... కొంచెం దిల్ ఉంటే చాలు ||CM PM||

||చరణం 1||
డైలి నేను తిరగడానికి చార్టర్డ్ ఫ్లైటే వద్దు....... సింపుల్ బైకొకటుంటే చాలు
బీటే నేను వెయ్యటానికి మిస్ యూనివర్సే వద్దు..... లోకల్ బ్యూటి ఐతే చాలు
అలసట వస్తే తాగడానికి అమృతమేమి వద్దు...... చల్లని బీరొకటుంటే చాలు
ఆపదలో కాపాడటానికి పైవాడేమి వద్దు........ నలుగురు ఫ్రెండ్సే ఉంటే చాలు
హాపీగా లైఫంతా గడపటానికీ........
కొంచెం నేముంటే చాలు...... కొంచెం ఫేముంటే చాలు
కొంచెం డబ్బుంటే చాలు.... కొంచెం దిల్ ఉంటే చాళు ||CM PM||

||చరణం 2||
చూడాల్సింది చూడటానికి కంప్యూటర్ తెర వద్దు..... కమ్మని కలలే కంటే చాలు
బ్రతకాల్సింది బ్రతకడానికి ఏడు జన్మలే వద్దు..... ఉన్న ఒక్క జన్మమే చాలు
పుణ్యం కాస్త దక్కటానికి పూజలు గీజలు వద్దు..... పరులకు సాయం చేస్తే చాలు
తోచిన పనినే చెయ్యటానికి పంచాంగం విప్పద్దు........ పంజా విప్పావంటే చాళు
హాపీగా లైఫంతా గడపటానికీ........
కొంచెం నేముంటే చాలు...... కొంచెం ఫేముంటే చాలు
కొంచెం డబ్బుంటే చాలు.... కొంచెం దిల్ ఉంటే చాళు ||CM PM||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips