02 July 2010

నన్నేదొ సెయ్యమాకు నడుము కాడ..ఏహ్.ఆ..

నన్నేదొ సెయ్యమాకు నడుము కాడ..ఏహ్.ఆ..
ఏదేదొ సెయ్యమాకు ఏటి కాడ..ఏహ్..ఆ..
ముద్దులెట్టి ముగ్గుల్లో దించమాకు
ముగ్గులోకి దించి నన్ను ముంచమాకు
నేనింక చిన్నదన్నిరా..
శాకేదొ సెప్పమాకు సందకాడ..ఏ
సోకంతా దాచుకోకు ఆడ ఈడ..మ్మ్..ఏ
అడ్డమైన సిగ్గు నువ్వు చూపమాకు
అడ్డు గోడ పెట్టి నాను ఆపమాకు
అలవాటు చేసుకోవమ్మో

కంది చేనుకు షికారుకెలితె
కందిరీగే నను కుడితే
కంది చేనుకు షికారుకెలితె
కందిరీగే నిన్ను కుడితే
మంట నాలో మొదలవుతుంటే
మందు నేనె ఇస్తుంటే
పెదవి ఎంగిలి పైపైన పూస్తె
బాధ తప్పి బాగుంది అంటు
హాయిగ కనులే మూస్తే
అంతకంటె హాయిగుంది వదులుకోకు
ముందుకొచ్చి ముట్టుకుంటే ముడుచుకోకు
అలవాటు చేసుకోవమ్మో

చింతపల్లి సంతకు వెళితె
చింతపూల చీర కొంటే
చింతపల్లి సంతకు వెళితె
చింతపూల చీర కొంటే
కట్టు నీకు కుదరకపోతే
నువ్వు సాయం చేస్తుంటే
చెంగు పట్లు దోపుతువుంటె
చెంగు మని నువు వుల్లిక్కి పడగా
నాలో వుడుకే పుడితే
పెళ్ళి చీర కట్టే దాక రెచ్చిపోకు
పెద్ద పెద్ద ఆటలేవి ఆడమాకు
అలవాటు చేసుకోవయ్యో

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips