14 June 2010

భామా భామా బంగారు బాగున్నావే అమ్మడు

||పల్లవి||
భామా భామా బంగారు బాగున్నావే అమ్మడు
హొయ్ భామా భామా బంగారు బాగున్నావే అమ్మడు
బావా బావా పన్నీరు అయిపోతావా అల్లుడు
ముద్దు కావాలి........ హత్తుకోవాలి
అగ్గిరేగాలి సిగ్గుపోవాలి.... ఏం చేస్తావో చెయ్యి..... ||భామా భామా||

||చరణం 1||
ఎంచక్కా నీనడుమెక్కే ఆ కడవై ఉంటా సరదాగా
వాటంగా చెయ్‌వేస్తుంటే అది వడ్డాణం అనుకుంటాగా
ముచ్చటగా మెళ్ళో గొలుసై ఎద సంగతులన్ని వింటాగా
గుట్టంతా చూస్తానంటు గుబులెట్టేస్తావా సారంగా
వ్యవహారంగా మమకారంగా నిను చుట్టేస్తా అధికారంగా
గారంగా సింగారంగా ఒదిగుంటా ఒళ్ళో వెచ్చంగా ||భామా భామా||

||చరణం 2||
అబ్బోసి సొగసొగ్గేసి తెగచెలరేగావే లైనేసి
నినుచూసి తెగసిగ్గేసి తలవంచేశా మనసిచ్చేసి
చుట్టేసి పొగబెట్టేసి ననులాగేశావే ముగ్గేసి
ఒట్టేసి జతకట్టేసి వగలిస్తానయ్యో వలిచేసి
ఒసోసి తెగ ఉబ్బేసి మతిచెడగొట్టావే రాకాసి
ఎదోచేసి పొగమందేసి ననుకాపాడయ్యో దయచేసి ||భామా భామా||

No comments: