14 June 2010

అడగాలనుంది ఒక డౌటుని......

అడగాలనుంది ఒక డౌటుని...... సన్‌రైజులేని రోజేదని.....
మరి ఎవ్రీడేని సండే అని ..... అనకుంటె తప్పుకాదా అని.....
అదితెలిసి ఎందువలనో పెద్దవాళ్ళు ఒప్పుకోరు.....
పదమంటూ స్కూలుకేసి సిక్సుడేసు తరుముతారు
హే.... అయ్యయ్యో ఎంత తప్పో ఎవరూ అడగరే.....
హాపిగా ఆడుకుంటాం అంటే వదలరే......... ||అడగాలనుంది||

నీ హైటు నాకు ఉంటే....... అమ్మో ఎంత డేంజర్........
నాక్కూడా మీసముంటే..... ఏం చేస్తావు మేజర్........
క్లాసుమిస్ ఛైరులోన నేను కూర్చుంటా......
కామిక్స్ క్లాసుబుక్స్ చేసి చదివిస్తా......
స్కూలుకి ప్రిన్సిపల్ సార్ నేనౌతా......
ఆల్డేస్ హాలిడేస్ ఆడుకోండి అంటా.......
ఎగ్జాంస్ వస్తే అప్పుడు ఎలా మరి.......
మార్కులు కూడా మీరె వేస్తె సరి.......
హే.... అయ్యయ్యో ఎంత తప్పో ఎవరూ అడగరే.....
హాపిగా ఆడుకుంటాం అంటే వదలరే......... ||అడగాలనుంది||

చాలమ్మా ఆటలింకా .....కొంచెంసేపు మమ్మీ.....
రానంటే వెళ్ళిపోతా .....నో నో వద్దు డాడీ.....
ఆటకైన పాటకైన ఆఖరంటులేదా.....
ఆకలేస్తె అప్పుడైన అమ్మ గుర్తురాదా....
పిట్టలైన పొద్దుపోతె గూడు చేరుకోవా.....
పిల్లలైన పెద్దలైన రాత్రి నిద్దరోరా.....
నైటే లేని చోటే చూస్తె సరి....
అక్కడ ఆటకు బ్రేకులు ఉండవు మరి....
ఎంచక్కా నిద్రపోయి కలలో జారుకో.....
ఆ కలలో నువ్వుకోరే చోటే చేరుకో...... ||అడగాలనుంది||

No comments: