నీలికన్నుల నీడలలోనా దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో
అందుకో నన్నందుకో
నీలికన్నుల నీడలలోనా దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమేదో ఉందిలే ముందుందిలే
ఉందిలే ముందుందిలే
మబ్బుల పందిరి మనపై నిలిచే
ఎందుకు నిలిచే !
పచ్చిక పానుపు వెచ్చగ పిలిచే
ఏమని పిలిచే!
వీడని జంటగ రమ్మనీ
వసి వాడని పూలై పొమ్మనీ
తెలియరానిది ఈ గిలిగింత
ఏ గిలిగింత!
పలుకలేనిది ఈ పులకింత
ఏ పులకింత!
కనుపించనిదా వింతా!
అది కదలాడును మనసంతా
చల్లగ తాకే జ్వాలలు ఏవో
ఏమో ఏవో!
వేడిగ సోకే వెన్నెలలు ఏవో
ఏమో ఏవో!
చిన్నది విరిసే చూపులు
చెలి చిలికిన ముసి ముసి నవ్వులు
No comments:
Post a Comment