14 June 2010

ఓం...ఓం...

ఓం...ఓం...
రరరర రా రా రా

ఓం అనీ.. ఓం అనీ..
మొదలవుతూ ఉంది అనురాగపు తొలిగమకం..
మదినే మీటిందీ తొలి తాకిడిలో తమకం
ప్రణయమంత్రానికిది ప్రణవం
మౌనమే గానమయే సమయం
ఓం అనీ...ఓం అనీ..
మొదలవుతూ ఉంది అనురాగపు తొలిగమకం..

రరరర రా రా రా..

వరదై.. ఉరికే వయసు పరుగులో..
అలలై ..ఎగసే మనసు మడుగులో..
కలలకు అందని కలవరముందని తెలిసిన నిమిషములో
రరరర రా రా రా..

ఓం అనీ.. ఓం అనీ..
మొదలవుతూ ఉంది అనురాగపు తొలిగమకం..
మదినే మీటింది తొలి తాకిడిలో తమకం


ఆ.. ఆ..

చినుకై.. తడిమే వేలికొనలతో..
మెరుపై ..తరిమే వేడి కనులతో..
తొలకరి ఆశల తడిసిన ఊసులు చేసిన అల్లరిలో..
రరరర రా రా రా

ఓం అనీ.. ఓం అనీ..
మొదలవుతూ ఉంది అనురాగపు తొలిగమకం..
మదినే మీటింది తొలి తాకిడిలో తమకం

No comments: