పల్లవి:
I live for you అన్నది ప్రేమా
I die for you అన్నది ప్రేమా
నా పంచ ప్రాణాల పల్లవీ ప్రేమా
ప్రేమే నీ తోడు ప్రేమించీ చూడు
ఈ ప్రేమ వేదాల శృతిలో లయగా కలిసీ
||ఐ లివ్||
చరణం:
చిరునవ్వే విరిజల్లైనా అందాలే హరివిల్లైనా ఈ ప్రేమ వర్ణాలతోనే
కౌగిళ్ళే కవ్విస్తున్నా కసి కళ్ళే కాటేస్తున్నా ఈ ప్రేమ బాణాలతోనే
ఏ జన్మ గంధాలు పిలిచిందీ ప్రేమా
ఈ మౌనాలా నా గానాల కళ్యాణాల పందిట్లోనా
||ఐ లివ్||
చరణం:
వేదంలా మంత్రిస్తున్నా వెన్నెల్లా మనసిస్తున్నా ఈ ప్రేమ నీరాజనాలే
అనురాగం ముద్దిస్తున్నా అధ్వైతం సిద్దిస్తున్నా ఈ ప్రేమ ఆరధనేలే
ధర్మార్ధ కామాలు దాటిందీ ప్రేమా
నీలోనేను నాలోనువ్వు జెవించేటి సందిట్లోన
||ఐ లివ్||
No comments:
Post a Comment