17 November 2010

కొండమ్మో బంగారపు కొండమ్మా

కొండమ్మో బంగారపు కొండమ్మా ||2||
పిలిచినప్పుడు పల్కరు లేవే అంతు లేని అల్కలు లేవే
ఆడవాళ్లు అంతా ఇంతేలేవే, ఓ రంగుల బొమ్మా ||కొండమ్మో||
మారయ్యె ఓ టక్కుటమారయ్యా ||2||
పెళ్లీ పెళ్లీ అంటారయ్యా బేరాలకు దిగుతారయ్యా
మగవాళ్లు అంతా ఇంతేనయ్యా మాట్లాడకయ్యా ||మారయ్యో||

కట్నం నేరుగ బేరం చేసిన వాదన కళ్లారా చూసిన వాదన
బ్రహ్మదేవుడే రాసుంచాడు అమ్మా నాన్న ఔనన్నారు
కిక్కురుమనక తల ఊపాను కదమ్మా, తప్పేమిటమ్మా ||మారయ్యో||

మాటలు చూస్తే కోటలు దాటును జోరుగా
సొరకాయలు బహు కోస్తారుగా
అందంతోటి పనిలేదయ్యా ఆడది అయితే చాలు కదయ్యా
పైసా పడితే పల్టీకొడతారు కదయ్యా, మిమ్మెరుగుదుమయ్యా ||మారయ్యా||

పెళ్లి పెత్తనం పెద్దల చేతిల్లోనిది మన బడాయి చెల్లని చోటది
ప్రేమించడమే నా వంతు ఇక పిల్లల కనటం నీ వంతు
లోకంలో జరిగేదే ఈ తంతు ఇది నీకు తెలుసు ||కొండమ్మో||

పరులు చెప్పినట్లు సెయ్యని బొమ్మలా ఆహాహా భలే దద్దమ్మలా
పప్పు దప్పళం కారం చెట్నీ మీ తప్పు ఒప్పుకున్నారండీ
ఇప్పటికైనా కోతలు ఆపాలయ్యా ||కొండమ్మో|| ||మారయ్యో||

No comments: