24 November 2010

చల్‌రే చల్‌రే చెలరేగాలి దునియా మొత్తం దున్నెయ్యాలి

చల్‌రే చల్‌రే చెలరేగాలి దునియా మొత్తం దున్నెయ్యాలి
బరిలో దిగితే గెలిచెయ్యాలి అప్పుడే కదరా సరదావిలువైన
కొద్ది కాలాన్ని వదలొద్దం కాళ్ళతన్ని విజయంతో పొంది
పతకాన్ని ఎక్కెయి అందలాన్ని కలకన్నది మిగలొద్దురా
కలలా నీ నసీబు నీ చేతిలో ఉందిరో నువ్వు దిమాకు పెట్టేసి
యోచించరో ధమ్‌ ధమ్‌కే బోలో భజవానుగోతమ్‌ ||చల్‌రే||

గెలుపున్నది ఒక్కసారిగా కలగదు కదా నేరుగా
మనసెడితే ఏకదాటిగా మార్గం వెతుకొచ్చుగా
దొరికిన అలలను తెరచిన కనులతో కదలిక నిలబడి చూడు
పదపద పదమని ఓటమి తగదని పడినా లేవక పోదు
అదరకు బెదరకు దొరికిన దొదలకు అలుపని అరవకు బాసు
అలజడి తడబడి పొరబడి అడుగులు వెనకకి వేస్తే దాసు ||చల్‌రే||

చెలిమన్నది తోడులేనిదే బ్రతుకెంతటి భారమో
మనసున్నది ఇవ్వడానికే ఎందుకు మోహమాటమో
అదరకు అనకురా అడిగిన తడవగా కలిగిన సాయముచేద్దు
నలుగురు నడిచి నలిగిన దారిలో నువ్వు నడిచెయ్యెద్దు
జరిగిన దిదియని తరుచుగా తలవకు పదిలెయ్‌ వెళ్ళిన నేను
పెదవుల ప్రమిదలు చిరు చిరునవ్వుల దివ్వెలు యు డోంట్‌ మిస్సు ||చల్‌రే||

No comments: