22 November 2010

కన్నులతో పలకరించు వలపులు

కన్నులతో పలకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు
కన్నులతో పలకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు
రెండు ఏకమై ఒహొ
ప్రేమే లోకమై అహా
నామది పాడే పరాధీనమై అలాగా
కన్నులతో పలకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు

చల్లని వేళ మల్లెల నీడ చక్కని దొంగ దాగెనట
చల్లని వేళ మల్లెల నీడ చక్కని దొంగ దాగెనట
దారులకాచే సమయము చూచి దాచిన ప్రేమ దోచెనట
మరలా వచ్చెను మనసే ఇచ్చెను
మరలా వచ్చెను మనసే ఇచ్చెను
అతనే నీవైతే ఆమే నేనట ,నిజంగా ఉం ఉం

కన్నులతో పలకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు

నల్లని మేఘం మెల్లగ రాగ నాట్యము నెమలి చేసినది
నల్లని మేఘం మెల్లగ రాగ నాట్యము నెమలి చేసినది
వలచినవాడు సరసకురాగ ఎంతో సిగ్గు వేసినది
తనివితీరా తనలో తానే
తనివితీరా తనలో తానే మనసే మురిసింది పరవశమొందగా ఓ ఐ సీ

కన్నులతో పలకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు
రెండు ఏకమై ఒహొ
ప్రేమే లోకమై అహా
నామది పాడే పరాధీనమై అలాగా
కన్నులతో పలకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు

No comments: