14 November 2010

తమ్ముడు అరె తమ్ముడు ఈ తికమక తెగులే ప్రేమంటే

హేహే హేహే హేహే హేహే
తమ్ముడు అరె తమ్ముడు ఈ తికమక తెగులే ప్రేమంటే
ఈ తెలియని దిగులే ప్రేమంటే
నను అడగరా చెబుతా డౌటుంటే
నువు బెదరవుకదా నా మాటింటే
అమ్మడూ హోయ్ అమ్మడూ నువ్వు మరీ పరాగ్గా వుంటుంటే
నీకు నిదరే సరిగా రాకుంటే
ఏం జరిగిందో తెలియాలంటే ఆ రహస్యాన్ని చెబుతా వింటే
మాస్టారూ మాస్టారూ మాంచి లెక్చర్‌ ఇచ్చారు
మాస్టారూ మాస్టారూ లవ్‌లో మీరు
మెగాస్టార్ ధాంక్యూ ||తమ్ముడు||

మీరంత బాగా పాడగలరని
మేము అస్సలనుకోలేదు మాస్టార్
ఇంతవరకు నేనూ ఎప్పుడూ పాడలేదు ఇదే ఫస్టుటైమ్‌
సార్ మొదటిసారి మీరు అదరగొట్టేసారు సార్‌
హ మీ ఉత్సాహం చూసి ఏదో సరదాగా
హమ్‌ చేయాలనిపించింది చేసానంతే
మాస్టార్ ఈపాటకు మంచి స్టెప్ కలిసిందంతే అదురుతుంది
డాన్సేగా చాలా బాగుంటుంది చెయ్యండి
హే మేము కాదు మాస్టార్ మీరు
నేను డాన్సా నోనోనో
ప్లీజ్‌సార్‌ ప్లీజ్ ఓకే
హే సూపర్ట్ మీ లెక్చరే సూపర్ట్ ||2||
వేలవేల భాషలున్నా నేలమీద ఎక్కడైనా
ప్రేమ గ్రామరొక్కటే లవ్వర్‌ ఆలాంగ్వేజ్ తెలియనిదెవరు
మూగ సైగలైన చాలు వేడి ఊపిరైన చాలు
గుర్తు పట్టలేరా ప్రేమికులు అవి అచ్చుతప్పులేని ప్రేమలేఖలు
అమెరికాలో ఇంగ్లీషు ప్రేమ ఆఫ్రికాలో జంగిల్ ప్రేమ
హ ఏకమయ్యే ఏకాంతమలో ఎక్కడైనా ఒకటే ప్రేమ
తమ్ముడు అరె తమ్ముడు
పొట్టివాడు కొత్తవాడు నల్లవాడు తెల్లవాడు
ప్రేమదేశ మెళ్లగానే మానవుడుగా మిగులుతాడు ||తమ్ముడు||

హేహే సూపర్ట్ మీ లెక్చరే సూపర్ట్ ||2||
లక్షలాది లక్షణాలు చూపుతున్న ప్రేమకున్న
అక్షరాలు మాత్రం రెండు అది మహాసముద్రం ప్రెంఢ్
సెంచరీల కొద్ది పెద్ద సీరియల్‌గా సాగుతున్న
మహా నవల రాసాడు ఆస్టోరీ కొట్టదు బోరు
" క " గుణింతం తెలియని వాళ్లు కాళిదాసులు అయిపోతారు
హ కాఫీ టీలే తాగనివాళ్లు దేవదాసులు అయిపోతారు
అమ్మడూ ఓ అమ్మడూ లబ్‌డబ్‌ హార్ట్‌బీట్‌
లవ్వు లవ్వు అన్నదంటే హైక్లాస్‌
లోక్లాస్‌ చూసుకోదు ప్రేమకేసు ||తమ్ముడు||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips