24 November 2010

పురుషుడు నేనై పుట్టాలి

పురుషుడు నేనై పుట్టాలి
ప్రకృతి నీవే రావాలి
ఇరువురి మనసులు కలవాలి
ఆ కలయిక కళకళలాడాలి ||పురు||

పుడమే నేనై పుట్టాలి
ఒడిదుడుకులను ఓర్వాలి
కడలిని నదినీ కలపాలి
ఆ కలయిక కళకళలాడాలి ||పురు||

మెరమెరలాడే వయసు నేనై
మిసమిసలాడే సొగసు నీవై
వెల్లువలాగా వెన్నెలలాగా
ముల్లోకాలను ముంచాలి ||పురు||

పైమెరుగులకే పరవశమయ్యే
పరువానికి పగ్గం వేసి
పగ్గం కట్టిన కన్నె మనసులో
లోతులు తెలిసి మసలాలి ||పురు||

దేవుడు నేనై పుట్టాలి
దేన్నో తాను ప్రేమించి
ఆడదాని మనసంటేనే
విషమని తెలిసి ఏడ్వాలి ||దేవు||

గాజు వంటి హృదయం తనది
రాతి వంటి నాతికి తగిలి
ముక్కలు చెక్కలుగా పగిలి
నెత్తురు కన్నీరవ్వాలి ||దేవు||

No comments: