15 November 2010

మిల మిల మిలమని సూర్యోదయమై

మిల మిల మిలమని సూర్యోదయమై తగిలెనులే తొలి ప్రేమ
తళ తళ తళమని చంద్రోదయమై తడిపెనులే నీ ప్రేమ
మిల మిల మిలమని సూర్యోదయమై తగిలెనులే తొలి ప్రేమ
తళ తళ తళమని చంద్రోదయమై తడిపెనులే నీ ప్రేమ
నేనే నా నేనే నా నేను చూస్తుంది నిన్నే నా
నిజమేనా నిజమేనా నమ్మదు నా మనసే
నేనేలే నేనేలే నువ్వు చూస్తుంది నన్నేలే
చిననాటి నీ చెలిమి ఎదురుగానిలిచెనులే
హాయ్ లే హాయ్ లే ప్రతిరోజు సంబరాలే
హాయ్ లే హాయ్ లే ఎండల్లో చల్లని వానలే
హాయ్ లే హాయ్ లే మది తాకే అంబారాలే
హాయ్ లే హాయ్ లే ఎద ఉగుతున్నది ఊయలే

మిల మిల మిలమని సూర్యోదయమై తగిలెనులే తొలి ప్రేమ
తళ తళ తళమని చంద్రోదయమై తడిపెనులే నీ ప్రేమ

ఏ మనసుకు రెక్కలు మొలిచే నువ్వే నన్నే కలిసాకే
తీపిని మించిన తిపే రుచి చూశా ఇపుడే
నింగికి నేలకు నడుమ మది నిలిచే నీతో నడిచే
రంగుల ఆ హరివిల్లై విరబూసే ప్రణయమే
అనందం అంటుంటే ఇన్నాళ్ళు విన్నాలే
ఈ రోజే తొలిసారి అది ఏమిటో కన్నాలే
సద్రం నీటి బొట్టై పిడికిట్లో ఒదిగేనేలే
ఆకాశం పులరెక్కై అరచేతుల్లో చిక్కిందిలే
హాయ్ లే హాయ్ లే ప్రతిరోజు సంబరాలే
హాయ్ లే హాయ్ లే ఎండల్లో చల్లని వానలే
హాయ్ లే హాయ్ లే మది తాకే అంబరాలే
హాయ్ లే హాయ్ లే ఎద ఊగుతున్నది ఊయాలే

మిల మిల మిలమని సూర్యోదయమై తగిలెనులే తొలి ప్రేమ
తళ తళ తళమని చంద్రోదయమై తడిపెనులే నీ ప్రేమ

చేతితో కనులను మూస్తే చీకట్లో నీ రూపం
రారా రమ్మని పిలిచే అది ఏమిటో చిత్రమే
ఇదివరకెన్నడు లేదే నాకంటూ ఒక గమ్యం
నువ్వే ఇక నా తీరం నీ వెనుకే పయనమే
అందంలో నను చూసి నీ రూపం కనిపించే
నీ పేరు ఎవర్న నీ పేరు వినిపించే
లోకం నాకు నువై నే శూన్యం ఐనాలే
నా ప్రాణం నిన్ను చేరి నీ ప్రాణం లో కలిసిందిలే

హాయ్ లే హాయ్ లే ప్రతిరోజు సంబరాలే
హాయ్ లే హాయ్ లే ఎండల్లో చల్లని వానలే
హాయ్ లే హాయ్ లే మది తాకే అంబరాలే
హాయ్ లే హాయ్ లే ఎద ఊగుతున్నది ఊయలే

మిల మిల మిలమని సూర్యోదయమై తగిలెనులే తొలి ప్రేమ
తళ తళ తళమని చంద్రోదయమై తడిపెనులే నీ ప్రేమ

No comments: