17 November 2010

గోరింకా గోరింకా రావా మా వంక ఏవంక

గోరింకా గోరింకా రావా మా వంక ఏవంక లెనట్టి ఊరె
మాదింక తన ప్రాణాలు పంచించి పాకే ఈ యేరు మా
ప్రాణాలు కాచించి ఊగే ఈ పైరు పేగే కదిలించే బంధాలకు
పెట్టిన పేరు ప్రేమ పెనవేసె మా ఊరు తీరే వేరు ||గోరింకా గోరింకా||

తెరతీసిన ఆహరివిల్లు అందంచిందే ఇల్లు, తెరిపే లేని రాని
తేనెల పూవుల జల్లూ చమరించే కన్నుల్లోని ఆరాని ఈ తడి
చాలు మనిషై ఉంటే చాలు మనవే పదికాలాలు గుండెల
లోతులు కొలవగ సరియైన సాధనం లేదుగ కష్టం కూడా
ఇష్టమే అది ఏదైన అదృష్టమే ముద్దుగ తడిసిన మనసులు
ముద్దు ముద్దుగ మురిసే మురిపాలూ ఏదో అనురాగం
వినిపించని గానం ఏదీ అంతా అనుబందం అనిపించే లోకం మాది ||గోరింకా గోరింకా||

కన్నమ్మను మించినదంట జన్మను ఇచ్చిన ఊరు కరిగే ఊరును
చూస్తే కన్నుల నీరే ఊరు మమకారం మాసిరి కాగా మాసరి
లేనేలేరు ఎపుడు కలిసే ఉంటాం ఎవరు ఒంటరి కారు ఎవ్వరికి
ఆపద వచ్చిన అది ఆపటానికే వేదన మృత్యువు కోరలు సాచిన
చితి చేరె వరకు చింతన అందరి క్షేమం ఆశయం అందకా
అడుగే వెనకేయం ఇంతే ఈ జన్మ ఇక ఊరె ఊపిరి అంటా
ఉంటే మరుజన్మ మరలొచ్చి ఇచటే పుడతా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips