20 November 2010

ఇల్లే ఇలలో స్వర్గమనీఇల్లాలే ఇంటికి దేవతనీ

ఇల్లే ఇలలో స్వర్గమనీఇల్లాలే ఇంటికి దేవతనీ
రుజువు చేసావూనీవూరుజువు చేసావూ
మనసే మనిషికి అందమనీమగడే శ్రీమతి దైవమనీ
రుజువు చేసావూనీవూరుజువు చేసావూ

మైకమనేచీకటిలోమమతకోసమై వెతికానూ||2||
కాంతికిరణమై కనిపించీజీవనజ్యోతిని వెలిగించావూ
అందముగాఅందానికి ఒక బంధముగా||2||
తొలినోముల ఫలమై దొరికావూ
నను వీడని నీడై నిలిచావూ
ఇల్లే ఇలలో స్వర్గమనీఇల్లాలే ఇంటికి దేవతనీ
రుజువు చేసావూనీవూరుజువు చేసావూ

చల్లని కన్నులలోవెలిగే వెన్నెలదీపాలూ
నా చిరునవ్వుకు ప్రాణాలూ
మనప్రేమకు ప్రతిరూపాలూ
నీ పెదవుల రాగములో విరిసే తీయని భావాలూ
ఆనందానికి దీవెనలూ
మన అనుబందానికి ఆరతులూ
మనసే మనిషికి అందమనీమగడే శ్రీమతి దైవమనీ
రుజువు చేసావూనీవూరుజువు చేసావూ

నాలో సగమై నీవే జగమైనేనే నీవుగ మారావూ||2||
మారని మనిషిని మార్చావూ
బ్రతుకే పండుగ చేసావూ
పెన్నిధివైఅనురాగానికి సన్నిధివై
కన్నులముందు వెలిసావూనా కలలకు రూపం ఇచ్చావూ

ఇల్లే ఇలలో స్వర్గమనీఇల్లాలే ఇంటికి దేవతనీ
రుజువు చేసావూనీవూరుజువు చేసావూ
అహాహాఆఆఆహాఅహాహాఆఆహా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips