17 November 2010

ఎందుకే సిగ్గెందుకో ఇంతలోనే అమ్మాయికి

ఎందుకే సిగ్గెందుకో ఇంతలోనే అమ్మాయికి
అంత సిగ్గు ఎందుకో ||ఎందుకో||
పంతాలే తీరెనని తెలిసినందుకే మనసులు కలసినందుకే
అందుకే సిగ్గందుకే

చిన్ననాటి చిలిపి తలపు ఇన్నాళ్లకు వలపు పిలుపు ||2||
చిరునవ్వుల చిన్నారీ ||2||
ఇంకా సిగ్గెందుకే ఎందుకో సిగ్గెందుకో

కొనసాగిన కోరికలే మురిపించెను వేడుకలై ||2||
తనివారగ ఈ వేళా ||2||
మనసే తూగాడెనే అందుకే సిగ్గందుకే

నునుసిగ్గుల తెరచాటున అనురాగం దాగెనులే ||2||
అనురాగం ఆనందం ||2||
అన్నీ నీ కోసమే
అందుకా ఆ సిగ్గందుకా ఆ
పంతాలు తీరెనని తెలిసినందుకా
మనసులు కలిసినందుకే, అందుకే సిగ్గందుకే

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips