21 November 2010

అందలం ఎక్కాడమ్మా

అందలం ఎక్కాడమ్మా
అందకుండపోయాడమ్మా
ఇంతవాడు ఇంతకు ఇంతై
ఎంతో ఎదిగిపోయాడమ్మా ||2||

నిన్నరేతిరి తాను పొన్నచెట్టు నీడ
నిన్నరేతిరి తాను పొన్నచెట్టు నీడ
ఎన్ని ఊసులో చెప్పి ఎన్ని బాసలో చేసి
ఎన్ని ఊసులో చెప్పి ఎన్ని బాసలో చేసి
ఒడిలోన ఒదిగినాడమ్మాఆఆ
నా ఎదనిండా నిండినాడమ్మా ఆఆ

అందలం ఎక్కాడమ్మా
అందకుండపోయాడమ్మా
ఇంతవాడు ఇంతకు ఇంతై
ఎంతో ఎదిగిపోయాడమ్మా

ఆమాటలకు నేను మైమరిచిపోయాను
ఆ మత్తులో కాస్త కనుమూసి ఒరిగాను
భళ్లునా తెల్లారిపోయెనమ్మాఓ
ఒళ్ళు ఝల్లున చల్లారిపోయెనమ్మా

అందాన్ని చూశానమ్మా
అందలం ఎక్కానమ్మా
ఎంతవాణ్ణి ఎంతైనా
నే నీలో ఇమిడిపోతానమ్మా
అందాన్ని చూశానమ్మా
అందలం ఎక్కానమ్మా
ఎంతవాణ్ణి ఎంతైనా
నే నీలో ఇమిడిపోతానమ్మా

వెన్నపూస వంటి కన్నెపిల్ల ఉంటే
వెన్నపూస వంటి కన్నెపిల్ల ఉంటే
సన్నజాజులే సిరులు,మల్లెపూవులే మణులు
సన్నజాజులే సిరులు,మల్లెపూవులే మణులు
నువులేక కలిమి లేదమ్మా,నీకన్నా కలిమి ఏదమ్మా
అందాన్ని చూశానమ్మా,అందలం ఎక్కానమ్మా
ఎంతవాణ్ణి ఎంతైనా నే నీలో ఇమిడిపోతానమ్మా
అందలం ఎక్కాడమ్మా
అందకుండపోయాడమ్మా
ఇంతవాడు ఇంతకు ఇంతై
ఎంతో ఎదిగిపోయాడమ్మా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips