18 November 2010

స్వాముల సేవకు వేళాయె వైళమె రారే చెలులారా

స్వాముల సేవకు వేళాయె వైళమె రారే చెలులారా||2||
ఆశీర్వాదము లభించుగా చేసే పూజలు ఫలించుగా ||స్వాములు||

ఎన్ని తీర్థములు సేవించారో ఎన్ని మహిమలను గడియించారో
విజయం చేసిరి మహానుభావులు మన జీవితములు తరించుగా ||స్వాములు||

లీలాశుకులు ఋష్యశృంగులు మన యతీంద్రులై వెలసిరిగా
ఏమి పూజలో ఏమి ధ్యానమో మన లోకములో ఉండరుగా ||స్వాములు||

ఏయే వేళలకేమి ప్రియములో ఆ వేళలకవి జరుపవలె
సవ్వడి చేయక సందడి చేయక భయభక్తులతో మెలగవలె ||స్వాములు||

No comments: