14 November 2010

మనస్సా ఎక్కడున్నావ్ ఇదేనా రావడం

మనస్సా ఎక్కడున్నావ్ ఇదేనా రావడం
వయస్సా ఎప్పుడొచ్చావ్ ఇవాళ చెప్పడం
నువ్వునుకోలేదు గుసగుసలు ఎన్నో వింటున్నా
నేననుకోలేదు మిసమిసలు నాలో పుడుతున్నా
ఇది అందమైన వింత ఆత్మ కధ

హంసగీతమే వినరాదా హింసమానరా మదనా
తెల్లవారిన తరువాత తెల్లబోకుమా లలనా
ఇపుడే విన్నాను చలి వేణువేదో
విడలే ఇకరాదు లేవమ్మా
చెవులే కొరికింది చెలిమింతి మాట
యదలో ఇక దాచలేవమ్మా
పూల గాలికి పులకరం గాలి ఊసుకి కలవరం
కంటిచూపులోకనికరం, కన్నెవయసుకే తొలివరం
మొదలాయే ప్రేమ ప్లస్ రాగసుధ ||మనస్సా||

రాయలేనిది ప్రియలేఖ రాయభారమె వినవా
వేదమంటివి శుభలేఖ వెన్నెలంటి నీ కలువ
పురులే విరిసింది నీలో వయ్యారం
కనులే తెరిచిందిలే పింఛం
వెలిగే నీలోనగుడి లేనిదీపం
ఒడిలోతీరింది ఆలోపం
ఎంకిపాటలోతెలుగులో తెలుగు పాటలో తేమలా
కలవనీయుమా మమతలాతరగిని ప్రియాకవితలా!
బహుశా ఇదేమో భామ ప్లస్ కదా ||మనస్సా||

No comments: