24 November 2010

ఏం ఎందుకని ఈ సిగ్గెందుకని

ఏం ఎందుకని
ఈ సిగ్గెందుకని
ఎవరికి తెలియదని ||ఏం||

దీపముంటే సిగ్గంటిని
చీకటైనా సిగ్గెందుకు
మొగ్గ విరిసే తీరాలి
సిగ్గు విడిచే పోవాలి ||ఏం||

ఆ గదిలో నీ హృదిలో
కౌగిలిలో ఈ బిగిలో
ఏలా వుందో ఏమౌతుందో
ఏం చేయాలని నీకుందో చెప్పు ||ఏం||

ఊహు! పక్కన చేరాడా చెల్లీ
చెక్కిలి నొక్కాడా
ఇక్కడనా చెక్కిలినా
ఏమిటిదీ గిల్లినదా
పంటికి గోటికి తేడా లేదా
ఎందుకంటే ఈ బుకాయింపులు ||ఏం||

పగటి వేషం నాదమ్మా
రాత్రి నాటకం నీదమ్మా
అందుకని అందుకని
నువు చేసినదంతా చెప్పాలి
నే చెప్పినట్లు నువు చేయాలి ||ఏం||

No comments: