24 November 2010

మహాకనకదుర్గా విజయకనకదుర్గా

మహాకనకదుర్గా విజయకనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత
మహాకనకదుర్గా విజయకనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత
శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి
అష్టాదశ పీఠాలను అధిష్టించు ఆదిశక్తి
మహాకనకదుర్గా విజయకనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత

ఓంకార రావాల అలల కృష్ణాతీరంలో
ఇంద్రకీల గిరిపైన వెలసెను కృతయుగములోన
ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను
పరమశివుని మెప్పించి పాశుపతము పొందెను
విజయుడైన అర్జునుని పేరిట విజయవాడ అయినది ఈ నగరము
జగములన్నియు జేజేలు పలుకగ కనకదుర్గకైనది స్ధిరనివాసము
మేలిమి బంగరు ముద్దపసుపు కలగలిపిన వెన్నెలమోము
కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ
అమ్మ మనసుపడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడక
ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్దరూపం
ముక్కోటి దేవతలందరికి ఇది ఇల్లే పుట్టిదీపం

మహాకనకదుర్గా విజయకనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత

దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో
స్వర్ణ కవచములు దాల్చిన కనకదుర్గాదేవి
భవబందాలను బాపే బాలా త్రిపురసుందరి
నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి
లోకశాంతినే సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రీ
అక్షయ సంపదలెన్నో అవని జనుల కందించే దివ్య రూపిణీ మహాలక్ష్మి
విద్యా కవన గాన మొసగు వేదమయి సరస్వతి
ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించే మహాదుర్గ
శత్రు వినాసిని సత్యస్వరూపిని మహిషాసురమర్ధిని
విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజరాజేశ్వరి
భక్తులందరికి కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం దుర్గమ్మా నీ దర్శనం

మహాకనకదుర్గా విజయకనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత
మహాకనకదుర్గా విజయకనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత

No comments: