17 November 2010

కీరవాణి చిలకలా కొలికిలా పాడవేమే

సా నిసరీసాని సా నిసమగామరి
పదసా నిసరీసాని సా నిసమగామరి
పదసససని రిరిరిన గగగరి
మమమగ పా సా ని ద ప మ గ రి స ని
కీరవాణి చిలకలా కొలికిలా పాడవేమే
వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగ
అలరులు కురిసిన ఋతువుల తడిసిన
మధురసవాణి కీరవాణి ||చిలకల||

గరిస పమగ పాని సరిగ రిగస నీద
ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా
నీ గగనాలలో నే చిరుతారనై
నీ అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే
సలలిత కలరుత స్వరనుత గతియుత
గమకము తెలియకనే కీరవాణి
చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
ఇలరాలిన పువులు వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన
మంజులవాణి ||కీరవాణి||

నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై
నీ కవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై ఎదలో ఎదలే కదిలే
పడుచుల మనసుల పంజర శుకముల
పలుకులు తెలియకనే ||కీరవాణి||

No comments: