17 November 2010

కన్నులు నీవే కావాలి కలనై నేనే రావాలి

కన్నులు నీవే కావాలి కలనై నేనే రావాలి
కవితే నీవై ఉరకాలి కావ్యం నేనై నిలవాలి ||కన్నులు ||

మనసు నేనై ఉండాలి మమత నీవై నిండాలి
కడలి నేనై పొంగాలి నదివి నీవై తేరాలి
నదివీ నీవై తేరాలి ||కన్నులు||

తొలకరి నీవై చిలకాలి మెలకను నేనై మొలవాలి ||2||
దైవం నీవై నిలవాలి ధర్మం నేనై నడవాలి
ధర్మం నేనై నడవాలి ||కన్నులు||

శిల్పం నీవై కల్పం నేనై చిరకాలం జీవించాలి ||2||
చెరగని మారని శిలాక్షరాలై చిరంజీవులం కావాలి ||2|| ||కన్నులు||

No comments: