14 November 2010

అబబ్బా ఇద్దూ అదిరేలా ముద్దూ

అబబ్బా ఇద్దూ అదిరేలా ముద్దూ
అమ్మమ్మా ఇద్దూ మధురాల మరుముద్దూ ||అబబ్బా||
చలిపులి పంజా విసిరితే సలసలకాగె వయసులో
జిలజిలలాడే సొగసుకే జోలాలి ||అబబ్బా||

వాటేసుకో వదలకు వలపుల వల విసిరి
వాయించు నీ మురళిని వయసు గాలిపోసి
దోచేయ్యనా దొరికితే దొరకని కోకసిరి
రాసేయ్యనా పాటలే పైట చాటు చూసి
ఎవరికి తెలియవు యదరసనసలు
పరువాలాటకు పానుపు పిలిచాక
తనువు తాకిన తనవి తీరని వేళా ||అబబ్బా||

జాబిల్లితో జతకలు జగడపు రగడలతో
పొంకాలతో నిలునిలు పొగడవాలే
ఆకాశమే కొలుకొలు తొడినిడు నడుమిదిగో
సూరీడునే పిలు పిలు చుక్కా చూసి పోకే
అలకల చిలకలు చెలి రుసరుసలూ
ఇక జాగెందుకు ఇరుకున పడిపోక
మనసు తీరిన వయసుమారనివేళ ||అబబ్బా||

No comments: