15 November 2010

కన్ను కన్ను కలుపుకొని ఎన్నో ఎన్నో కలలుగని

కన్ను కన్ను కలుపుకొని ఎన్నో ఎన్నో కలలుగని ||2||
ఆ కలనై సాగాలి ఆకాశం దాటాలి
గువ్వలమవుతూ రివ్వు రివ్వు రివ్వంటుంటే తారాగణం
మాకందిస్తుంది నీరాజనం ||కన్ను||

పొదరిళ్లు పూలపళ్లు హరివిల్లు
లేళ్లు కుందేళ్లు వీళ్లుంటే చాలు
స్వర్గంలో సంసారం స్వప్నాలే సంతానం
ఆ జాబిలే మా నెచ్చిలి ఈ కౌగిలే మా లోగిలి
చెక్కిలి గింతల చుట్టాలు కందిన గుర్తులు కష్టాలు
ప్రణయాలే మా పోకలు ||కన్ను||

చైత్రాలు సంగీతాలు సరదాలు సందళ్లు
మాదేశంలో సిరులు సంపదలు
ముచ్చట్లే రత్నాలు మురిపాలే వరహాలు
ముద్దాటలే ముప్పూటలు ముత్యాలయ్యే ముచ్చెమటలు
అల్లరి చెండులే నాట్యాలు తుంటరి నవ్వులే గానాలు

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips