18 November 2010

ఇందురుడో చందురుడో ఎవరితడో ఠక్కున చెప్పు

ఇందురుడో చందురుడో ఎవరితడో ఠక్కున చెప్పు
పాపారాయుడి మనవడు ఇతడా ఇతడా ఇతడా ఠక్కున చెప్పు||ఇందు||
మారుడె మారుడెమారుడె ఇతడా పంజా విసిరిన బెబ్బులి ఇతడా
గారడి చేసెడి గోపుదె ఇతడా
తప్పని భస్మం చేసే శివుడా
హే బల్లేలక్కాబల్లేకల్లా చీరాలక్కా పేరాలక్కా
గుంటూరక్కా పుత్తూరక్కా తిరుపతిక్కా
హే బల్లేలక్కా బల్లేలక్కా చెక్కాముక్కా తనదే నక్కా
అన్నయ్యొస్తే ఆంధ్రా కాదా అమెరిక్కా

గోదావరి తీరం రాజనాల బియ్యం మరిచిపోవమ్మా
మాపల్లె పడుచుల గారడి కన్నులు మరచిపోనమ్మా
తిమ్మరాయల మిట్ట సంబరాల ఏటిగట్టు దుమ్ము తెగరేగు రోడ్డు
చెడుగుడు చెడుగుడు చెడుగుడు చెడుగుడు చెడుగుడు ||2||
ఆడిన ముచ్చట పడి పడి పెరిగిన పచ్చని పసిరిక
చెడమడ చెడమడ కురిసిన మంచూ
గుడగుడ గుడగుడ ఉడికిన ఇడ్లీ
దడదడ దడదడ అదిరెడు రైలూ గడగడ గడగడ పరిగిడు కాలువ
బరబర బరబర మడిచిన బీడా మెరమెర మెరమెలి తిప్పిన మీసం
మనసుని వదలవు మైమైమైమై
ఏలేలో గ్రామంలో గుడిసెలోన కొద్దికాలం ఉండి పొండిరా
తాటాకు కప్పు చిల్లుల్లోంచి నక్షత్రాన్ని లెక్కపెట్టరా
కూయు సెలఫోన్ నసలన్నీ ఆపి
కొంచెం కీచురాళ్ళ ఇచ్చకాలు విందాం
వట్టి కాళ్ళతో గట్టుమీద నడుస్తూ
మట్టితో మాటలాడుకుందా
చిన్నపిల్లలౌదాం
ఆడమర్రికీ జడలు వేసి మల్లెపూలు పెట్టుదామే
ఊళ్ళోని గ్రామదేవత కత్తిపుచ్చుకొని పెన్నిల్ చెక్కుదామా ||వల్లేలక్కా||

ఏలేలో పోపుల పెట్టెలో అమ్మచేతి రుచి ఉండురా
రోటిలో నూరి నూరి వొండు నాటుకోడి ఎంత రుచిరా
ఏలేలో ఆవూ మేకా మీద ఉన్న పాశం
మన రేషన్ కార్డో చేర్చాలందాం నేస్తం
నీళ్ళు అడిగితే చల్లనిచ్చు నైజంపల్లెల్లో
మనుషులలోనే ఉన్నదంటానేస్తం
పంబల ముసల్దిచ్చే పసరు
ముందుకూ దెయ్యాలే పారిపోవా
మజ్జారే పక్కింటి వాళ్ళకీ వండి వార్చెడీ ప్రేమ మనది నేస్తం ||బల్లేలక్కా||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips