20 November 2010

రామ సుగుణధామా రఘువంశజలధిసోమా

రామ సుగుణధామా రఘువంశజలధిసోమా
శ్రీరామ సుగుణధామా
సీతామనోభిరామా సాకేతసార్వభౌమా
శ్రీరామ సుగుణధామా

మందస్మిత సుందర వదనారవింద రామా
ఇందీవర శ్యామలాంగ వందితసుత్రామా
మందార మరందోపమ మధురమధురనామా
మందార మరందోపమ మధురమధురనామా
శ్రీరామ సుగుణధామా రఘువంశజలధిసోమా
శ్రీరామ సుగుణధామా

అవతారపురుష రావణాది దైత్యవిరామా
నవనీత హృదయ ధర్మనిరతరాజలరామా
పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామా
పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామా
శ్రీరామ సుగుణధామా రఘువంశజలధిసోమా
సీతామనోభిరామా సాకేతసార్వభౌమా
సీతామనోభిరామా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips