22 November 2010

ఆడే పాడే పసివాడ ఆడేనొయి నీతోడ

ఆడే పాడే పసివాడ ఆడేనొయి నీతోడ
ఆనందం పొంగేనోయి దీపావళి
ఇంటింట వెలుగు దీపాల మెరుగు
ఎనలేని వేడుకరా ఆ ఆ
ఎనలేని వేడుకరా

చిరునవ్వు వెన్నెల్లు చిలికేటి వాడ
అరుదైన చిరుముద్దు అరువీయరారా
చిరునవ్వు వెన్నెల్లు చిలికేటి వాడ
అరుదైన చిరుముద్దు అరువీయరారా
నా మదిలో నీకు నెలవే కలదు
నా మదిలో నీకు నెలవే కలదు
బదులే నాకు నీవీయవలదు
నీపై మేము నిలిపిన ఆశలు నిజమైన చాలునురా
ఆ ఆ నిజమైన చాలునురా

చిన్నారి జయమంచు మ్రోగె పటాసు
చిటపటమని పూలు చిమ్మే మతాబు
చిన్నారి జయమంచు మ్రోగె పటాసు
చిటపటమని పూలు చిమ్మే మతాబు
నీరూపమే ఇంటి దీపము బాబు
నీరూపమే ఇంటి దీపము బాబు
మాలో పెరిగే మమతవు నీవు
మంచనిపించి మము మురిపించిన మరె వేరే కోరమురా
మరె వేరే కోరమురా

ఆడే పాడే పసివాడ ఆడేనొయి నీతోడ
ఆనందం పొంగేనోయి దీపావళి
ఇంటింట వెలుగు దీపాల మెరుగు
ఎనలేని వేడుకరా ఆ ఆ
ఎనలేని వేడుకరా

No comments: